logo

ఉపాధి పనుల్లో లోపాలుంటే చర్యలు

ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ ముఖలింగం సిబ్బందిని హెచ్చరించారు. సంతకాలు లేకుండానే మస్తర్లకు వేతనాలు ఇచ్చారన్నారు.

Published : 01 Mar 2024 02:44 IST

మాట్లాడుతున్న డ్వామా పీడీ ముఖలింగం

నల్లజర్ల, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ ముఖలింగం సిబ్బందిని హెచ్చరించారు. సంతకాలు లేకుండానే మస్తర్లకు వేతనాలు ఇచ్చారన్నారు. నల్లజర్ల మండలంలో 2022-23లో రూ.8.90 కోట్లతో 731 పనులు చేపట్టారు. దీనిపై సామాజిక తనిఖీ నిర్వహించి, గ్రామసభలు జరిపారు. గురువారం నిర్వహించిన ప్రజావేదికకు పీడీ ముఖలింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో చెరువును ఊరికి 5 కి.మీ. దూరంలో ఉన్నట్లు చూపారన్నారు. అయిదు రోజుల పనికి ఆరు రోజులు వేతనాలు ఇచ్చారన్నారు. పనికిరాకున్నా మస్తర్లు వేయడం, తర్వాత కొట్టేయడం, దిద్దుబాటు వంటి లోపాలున్నట్లు గుర్తించామన్నారు. చాలా గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు.. మేట్లపై తప్పిదాలను నెడుతున్నారని, అది సరికాదన్నారు. పూర్తి వివరాలు ఇవ్వని, ప్రజావేదికకు హాజరుకాని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం తగదని, జవాబుదారీగా ఉండాలన్నారు. ట్రైనీ సబ్‌ కలెక్టర్‌ సువర్ణ, ఎంపీడీవో నరేష్‌కుమార్‌, ఏపీడీ అప్పలరాజు, సోషల్‌ఆడిట్‌ హెచ్‌ఆర్‌ నరేష్‌, ఏపీవో జేవి.రమణ, బాషా, తులసీనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని