logo

పార్లమెంట్‌ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే

ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థిగా డాక్టర్‌ మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పేరును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ప్రకటించారు.

Published : 03 Apr 2024 02:52 IST

కాకినాడ లోక్‌సభకు పళ్లంరాజు.. రాజమహేంద్రవరం గిడుగు రుద్రరాజు 

కాకినాడ కలెక్టరేట్‌, అమలాపురం కలెక్టరేట్‌: ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థిగా డాక్టర్‌ మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పేరును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ప్రకటించారు. పళ్లంరాజు 1989, 2004, 2009 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా విజయం సాధించారు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1991, 1998, 2014లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు.

 రాజమహేంద్రవరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ పీసీసీ కమిటీ ఛైర్మన్‌ గిడుగు రుద్రరాజు పేరు ఖరారైంది. ఆయన 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలెప్‌మెంట్‌ ఛైర్మన్‌గా, 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా, 2012లో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత 2022 నవంబరు వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అనంతరం పీసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్ల పాటు నిర్వహించారు. ఇటీవల వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో గిడుగు అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని