logo

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు

ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా మద్దతు ధర ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

Published : 03 Apr 2024 02:58 IST

తేమ యంత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

కొవ్వూరు పట్టణం: ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా మద్దతు ధర ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. కొవ్వూరు మండపం కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. రైతుకు ఇబ్బందులు లేకుండా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 229 ఆర్బీకేల్లో 3.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమన్నారు. ఈక్రాప్‌ నమోదు ఇప్పటికే పూర్తయినందున అధికారులు అన్ని కేంద్రాల్లో ధాన్యం సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. తేమ శాతం పరిశీలించి మిల్లులకు పంపించాలన్నారు. కోతలకు ముందుగానే షెడ్యూలు నిర్ణయించి హమాలీలను ఏర్పాటు చేసి, వాహనాలకు జియోట్యాగింగ్‌ చేయాలన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని, సమస్య వస్తే తక్షణం పరిష్కరించాలన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంయుక్త కలెక్టర్‌ తేజ్‌భరత్‌, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, పౌరసరఫరాల శాఖ డీఎం టి.రాధిక, తహసీల్దారు మస్తాన్‌, ఏడీఏ పి.చంద్రశేఖర్‌, ఏఓ గంగాధర్‌, సొసైటీ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని