logo

ప్రజాభిప్రాయ సేకరణ విస్తృతం చేస్తా: నల్లమిల్లి

న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో ప్రజాభిప్రాయ సేకరణను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

Published : 03 Apr 2024 03:01 IST

వడిశలేరులో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రామకృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు

రంగంపేట, న్యూస్‌టుడే: న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో ప్రజాభిప్రాయ సేకరణను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రంగంపేట మండలం వడిశలేరులో జిల్లా తెదేపా ప్రధానకార్యదర్శి ఆళ్ళ గోవిందు స్వగృహం నుంచి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయం కోరారు. రామకృష్ణారెడ్డికి తమ పూర్తి మద్దతు తెలుపుతూ మర్రిపూడి గ్రామ తెదేపా కమిటీ తీర్మానం చేసిందని, ఆ ప్రతిని ఆయనకు వారు అందించారు. రాత్రి చేపట్టిన కార్యక్రమంలో నల్లమిల్లి మాట్లాడుతూ బుధవారం జి.మామిడాడలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత అనపర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లోను తన కుటుంబంతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తన తండ్రి దివంగత మూలారెడ్డి సన్నిహితులు, అభిమానులు ఉన్నారని, వారి వద్దకు వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహిస్తానన్నారు. శుక్రవారం మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తానన్నారు. అభిమానులు సెల్‌ఫోన్‌ టార్చ్‌ వెలుగును చూపుతూ మద్దతు తెలిపి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. డీసీఎంఎస్‌ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల వెంకట్రాజు, మండల తెదేపా అధ్యక్షులు ఎలుబంటి సత్తిబాబు, కర్రి వెంకటరామారెడ్డి, తెదేపా నాయకులు టి.సుధాకర్‌రెడ్డి, నీలపాల త్రిమూర్తులు, ఉద్దండ్రావు శ్రీనివాసరావు, వి.వి.వి.శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని