logo

‘అనంత’ పరాభవం.. వీడియో వైరల్‌

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో సోమవారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్సీ అనంత బాబును దళితులు ఘెరావ్‌ చేసిన సంఘటన తెలిసిందే.

Updated : 03 Apr 2024 07:21 IST

గన్‌మెన్‌ సాయంతో మోటారు సైకిల్‌పై వెళ్లిపోతున్న ఎమ్మెల్సీ అనంత బాబు

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో సోమవారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్సీ అనంత బాబును దళితులు ఘెరావ్‌ చేసిన సంఘటన తెలిసిందే. దళిత డ్రైవర్‌ను చంపి ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి విగ్రహానికి దండేస్తావా అంటూ నిలదీయడమే గాక తరమడం సామాజిక మాధ్యమాల్లో మంగళవారం విస్తృతంగా వైరల్‌ అవుతోంది. కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుతో కలిసి ఈ గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ ఎస్సీ కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. దళితుడిని చంపిన వ్యక్తిని దళిత కాలనీలోకి ఎందుకు రానిచ్చారంటూ ఓ యువకుడు తీవ్ర పదజాలంతోనే నిరసన తెలిపాడు. గన్‌మెన్‌ల సాయంతో ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్సీ పలాయనం చిత్తగించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా ఈ పరాభవంతో ఎమ్మెల్సీ మంగళవారం ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని