logo

జనసేనానికి జననీరాజనం

: అడుగడుగునా పూల జల్లులు..జై జనసేన అంటూ నినాదాలు.. చిన్నారులు మొదలు యువత, మహిళల అపూర్వ స్వాగతాల నడుమ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచార యాత్ర మంగళవారం ఉత్సాహంగా సాగింది.

Updated : 03 Apr 2024 04:32 IST

35 కి.మీ. మేర సాగిన పవన్‌ ప్రచార యాత్ర

పిఠాపురం, కొత్తపల్లి, న్యూస్‌టుడే: అడుగడుగునా పూల జల్లులు..జై జనసేన అంటూ నినాదాలు.. చిన్నారులు మొదలు యువత, మహిళల అపూర్వ స్వాగతాల నడుమ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచార యాత్ర మంగళవారం ఉత్సాహంగా సాగింది. ప్రజలతో కలసి అడుగులేస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.

వారాహి విజయభేరి యాత్ర నాలుగో రోజు పవన్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో గొల్లప్రోలు జడ్పీ బాలుర పాఠశాల పక్కనున్న హెలీప్యాడ్‌ వద్ద ఉదయం 10గంటలకు దిగారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ జాతీయ రహదారి మీదుగా వై జంక్షన్‌, పశువుల సంత, ఆర్టీసీ బస్టాండు మీదుగా ఏబీసీ చర్చికి 10.15 గంటలకు చేరుకున్నారు.. 10.40 గంటలకు ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చి ర్యాలీగా స్టేట్‌ బ్యాంకు వద్ద నుంచి మాధవపురం రోడ్డు, ఇసుకపల్లి, నాగులాపల్లి, పొన్నాడ, మూలపేట, రామన్నపాలెం, ఉప్పాడ, కొత్తపల్లి, యండపల్లి జంక్షన్‌ మీదుగా పాదగయ కూడలి, జగ్గయ్యచెరువు నుంచి కుమారపురంలో తాను బస చేసే హోటల్‌కు సాయంత్రం 4.27 గంటలకు చేరుకున్నారు. దాదాపు ఆరున్నర గంటల పాటు ప్రజలతో మమేకమై 35 కిలోమీటర్ల మేర ఎన్నికల ప్రచారం సాగించారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు. ః మంగళవారం సాయంత్రం పవన్‌ తెనాలి వెళ్లారు. బుధవారం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి పిఠాపురం ఈ నెల 8న వస్తారు. 9న ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.

బిడ్డా.. నువ్వు గెలవాలి: అమీనాబాద్‌ కూడలిలో ఆత్మీయ ఆలింగనం

ఇదీ మా అజెండా

ఈనాడు, కాకినాడ: ‘పిఠాపురం నియోజకవర్గానికి శతాబ్దాల చరిత్ర ఉంది.. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేతాల కూడలిగా ప్రసిద్ధి పొందింది.. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తా.. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తెదేపా- జనసేన- భాజపా కూటమి అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయబోతున్నామనే అంశంపై జనసేనాని ఇచ్చిన హామీలతో కరపత్రాన్ని పిఠాపురం మండలం కుమారపురంలోని బస ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. తెదేపా అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారని, వర్మ అనుభవం ఈ ఎన్నికల్లో తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్‌ తెలిపారు. అందరం సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. వర్మ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీలు, కూటమి చేసే అభివృద్ధి కార్యక్రమాలు బుధవారం నుంచి ఇంటింటికీ వివరిస్తామన్నారు. అన్ని మండలాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు.

పవన్‌ కల్యాణ్‌ హామీలతో కరపత్రం.. ఇంటింటి ప్రచార కరపత్రాలు ఆవిష్కరిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. చిత్రంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ తదితరులు

అభిమాన జనసంద్రం నడుమ జనసేనాని

ప్రచారంలో పవన్‌తో స్వీయచిత్రం తీసుకుంటున్న మహిళలు

`

అమీనాబాద్‌లో పసికందును ఎత్తుకొని మురిపెంగా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని