logo

‘అర్హుల ఓట్లు తొలగిస్తే ప్రతిఘటన తప్పదు’

గ్రామాల్లో అర్హుల ఓట్లు తొలగించడానికి వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు బీఎల్‌వోలు సహకారం అందిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన తప్పదని తెదేపా నేతలు తహసీల్దార్‌ మధుబాబుకు విన్నవించారు.

Published : 30 Mar 2023 05:28 IST

తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న తెదేపా నేతలు

నూజండ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో అర్హుల ఓట్లు తొలగించడానికి వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు బీఎల్‌వోలు సహకారం అందిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన తప్పదని తెదేపా నేతలు తహసీల్దార్‌ మధుబాబుకు విన్నవించారు. పమిడిపాడులో 36మంది అర్హుల ఓట్లు తొలగించడానికి ఫామ్‌-7 సమర్పించారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనర్హుల ఓట్లు తొలగిస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎల్‌డీఏ ఛైర్మన్‌ లగడపాటి వెంకట్రావు, నేతలు బచ్చు అంజిరెడ్డి, సోమెపల్లి బ్రహ్మయ్య, చౌదరి, వంకాయలపాటి పేరయ్య, వెంకట్రావు, రొడ్డా వీరాంజనేయరెడ్డి, బత్తుల సుబ్బారావు, గంగినేని హనుమంతరావు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని