logo

జగన్‌ పాలనలో 188 మంది దళితుల ఊచకోత

ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు గురువారం నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 12 Apr 2024 04:14 IST

తెదేపాలో చేరిన ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు బసవరావు

బసవరావుకు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్‌

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు గురువారం నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో లోకేశ్‌ ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు మరో పది మంది పార్టీలో చేరినట్లు ప్రకటించారు. బసవరావు గతంలో జగన్‌కు సంఘీభావంగా పాదయాత్ర కూడా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్‌ విధానాలతో విభేదించి ఎస్సీ కమిషనర్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారని ప్రకటించారు. చంద్రబాబు నేతృత్వంతోనే దళితులు అభివృద్ధి సాధ్యమని నమ్మి తాను తెదేపాలో చేరినట్లు బసవరావు తెలిపారు. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన లంకా భువనశేషగిరి చరణ్‌, ఫణిశర్మ ఆధ్వర్యంలో 20 మంది తెదేపాలో చేరారు. వీరందరికీ లోకేశ్‌ పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన దళిత ద్రోహి జగన్‌ అని దుయ్యబట్టారు. 188 మంది దళితులను జగన్‌ పాలనలో ఊచకోత కోశారన్నారు. దళితులను చంపి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబు లాంటి వారిని పక్కన పెట్టుకున్నారని తెలిపారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. తెదేపా జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు పూర్తి రక్షణ  కల్పిస్తామన్నారు. ఎస్సీ కమిషనర్‌ను బలోపేతం చేసి స్వయం ఉపాధి రుణాలు అందజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని