logo

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!

జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో అబ్బాయిలు కన్నా అమ్మాయిల ఉత్తీర్ణత 15 శాతం, సీనియర్‌ ఇంటర్‌లో అబ్బాయిలు కన్నా అమ్మాయిలు 13 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Published : 13 Apr 2024 05:43 IST

జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రెండింటా వారిదే ఆధిక్యం

బాపట్ల, న్యూస్‌టుడే: జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో అబ్బాయిలు కన్నా అమ్మాయిల ఉత్తీర్ణత 15 శాతం, సీనియర్‌ ఇంటర్‌లో అబ్బాయిలు కన్నా అమ్మాయిలు 13 శాతం ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రంలో సీనియర్‌ ఇంటర్‌లో జిల్లా 17వ స్థానం, జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో 14వ స్థానంలో నిలిచింది. మొత్తం మీద సీనియర్‌ ఇంటర్‌లో 71 శాతం, జూనియర్‌ ఇంటర్‌లో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయి. బాపట్ల మండలం వెదుళ్లపల్లి బధిరుల ఆశ్రమ జూనియర్‌ కళాశాల జూనియర్‌ ఇంటర్‌లో 96 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కళాశాలల్లో అగ్రస్థానంలో నిలిచింది.

పెరిగిన ఉత్తీర్ణత: గతేడాది కన్నా సీనియర్‌ ఇంటర్‌లో ఆరు శాతం, జూనియర్‌ ఇంటర్‌లో ఏడు శాతం విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెరిగింది. అబ్బాయిలు కన్నా అమ్మాయిలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంలో నూరు శాతం ఫలితాలు వచ్చిన జూనియర్‌ కళాశాలలు రెండు ఉన్నాయి. 2023లో వెదుళ్లపల్లి బధిరుల ఆశ్రమ జూనియర్‌ కళాశాల సీనియర్‌ ఇంటర్‌లో నూరు శాతం ఫలితాలు సాధించింది. ఈసారి 96 శాతానికే పరిమితమైంది. సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈసారి ప్రథమ స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని