logo

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికలు పైచేయి సాధించారు.

Published : 13 Apr 2024 05:49 IST

ద్వితీయ ఏడాదిలో 87 శాతం ఉత్తీర్ణత

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికలు పైచేయి సాధించారు.  ద్వితీయ ఇంటర్‌లో 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ప్లస్‌ టూ కళాశాలలు 17 వరకు ఉండగా వీటిలో 50 శాతం కూడా ఉత్తీర్ణులు కాలేదు. పాఠశాలల్లో సరైన విద్యాప్రమాణాలు లేనందునే అత్యధిక విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో వృత్తి విద్య కోర్సుల్లో మొదటి ఏడాది 868 మంది విద్యార్థులకుగాను 503 మంది, ద్వితీయ ఏడాదిలో 946 మందికి 604 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కోర్సుల్లోనూ ఉత్తీర్ణత శాతం అనుకున్న స్థాయిలో నమోదు కాలేదు.

అందరూ తప్పారు

చినలింగాయపాలెం(కాకుమాను), న్యూస్‌టుడే: ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. సరైన వసతులు, అధ్యాపకులు, ల్యాబ్‌లు పుస్తకాలు ఇలా ఏవి వారికి సమకూర్చకుండా కళాశాల పేరుతో ప్రజలను సీఎం జగన్‌ మోసం చేశారు. అందుకు నిదర్శనమే ఈ ఫలితాలు. మండలంలోని చినలింగాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం కలిపి 11 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు అయిగురు ఉండగా అందరూ ఫెయిల్‌ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం మొదటి ఏడాది బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. ఈ పరిస్థితిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని