logo

ప్రథమంలో 12.. ద్వితీయంలో 14

ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు.  జిల్లాల విభజన జరిగినా గతేడాది ఉమ్మడిజిల్లా స్థాయిలో పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది మాత్రం మార్చారు.

Updated : 13 Apr 2024 06:31 IST

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు.  జిల్లాల విభజన జరిగినా గతేడాది ఉమ్మడిజిల్లా స్థాయిలో పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది మాత్రం మార్చారు. ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పల్నాడు పర్వాలేదనిపించే రీతిలో ఫలితాలు రాబట్టింది. ఉమ్మడి గుంటూరులో ఉన్నప్పుడు ఫలితాలతో పోలిస్తే ఇవీ తక్కువే. అప్పుడు టాప్‌ 5లో ఉండేది జిల్లా. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 65 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 12వ స్థానంలో ఉండగా, ద్వితీయ ఫలితాల్లో 73 శాతం ఉత్తీర్ణతతో 14వ స్థానంలో నిలిచింది. ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు మెరుగైన ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం బాలికలు 71 శాతం, ద్వితీయ సంవత్సరం బాలికలు 78 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు.

ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా స్థానాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని