logo

జనం లేక బస్సులోనే జగన్‌

సత్తెనపల్లిలో సీఎం నిర్వహించిన బస్సు యాత్రకు స్పందన నామమాత్రమే. బస్సులు ఏర్పాటు చేసి, మద్యం, డబ్బు పంపిణీ చేసినా జనం రాలేదు.

Updated : 13 Apr 2024 12:54 IST

సత్తెనపల్లి తాలుకా సెంటర్‌లో జగన్‌ రోడ్‌ షోలో పలుచగా జనం

సత్తెనపల్లి: సత్తెనపల్లిలో సీఎం నిర్వహించిన బస్సు యాత్రకు స్పందన నామమాత్రమే. బస్సులు ఏర్పాటు చేసి, మద్యం, డబ్బు పంపిణీ చేసినా జనం రాలేదు. కొన్నిచోట్ల జగన్‌ కూడా బస్సులోనే ఉండిపోయారు. పట్టణంలో సగం దూరమే రోడ్‌షో నిర్వహించి మమ అనిపించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల నుంచి శుక్రవారం యాత్ర మొదలైంది. మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో పట్టణంలోకి ప్రవేశించారు. అక్కడ్నుంచి తాలుకా సెంటర్‌ వరకు ఓ మోస్తరుగా జనం దారివెంట ఉన్నారు. తాలుకా సెంటర్‌ దాటిన తర్వాత జనం తగ్గిపోయారు. బస్టాండ్‌ సమీపంలోకి రాగానే జగన్‌ బస్సుపై నుంచి కిందకు దిగిపోయారు. ఎక్కడా ఆయన నోరు మెదపలేదు. ఉ.10.30 గంటలకే పట్టణానికి వచ్చిన వైకాపా శ్రేణులు మండుటెండలో మాడిపోయాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని