logo

వైకాపా సబ్బులు.. ఒళ్లంతా దురదలు

వైకాపా నాయకుల ప్రలోభాలు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కొద్ది రోజుల నుంచి తన అనుచరగణంతో తమ కంపెనీ సబ్బులను పంపిణీ చేయించారు.

Updated : 15 Apr 2024 06:38 IST

పట్నంబజారు, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ప్రలోభాలు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కొద్ది రోజుల నుంచి తన అనుచరగణంతో తమ కంపెనీ సబ్బులను పంపిణీ చేయించారు. ఒక్కొక్క ఇంటికి 9 సబ్బులు అందజేసి తమ కుమార్తెకు ఓట్లు వేయాలని చెప్పిస్తున్నారు. ఇటీవల ఈ సబ్బుని వాడిన యాదవబజారుకు చెందిన వ్యక్తి ఒంటికి దురద రావడంతో అతను కంగారు పడి వైద్యుడ్ని సంప్రదించగా కాలం చెల్లిన సబ్బును వాడడం వల్లనే దురద వచ్చిందని చెప్పారు. ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తాను వాడిన సబ్బుల బాక్స్‌పై గడువు తేదీ ముగిసినట్లు గమనించారు. ఇదే తరహాలో పలు ప్రాంతాల్లో గడువుతేదీ ముగిసిన సబ్బులను సరఫరా చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అసలు తమకు సబ్బులను ఎవరు పంపిణీ చేయమన్నారు... కాలం చెల్లినవి ఇచ్చి తమ ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ కొందరు బాధితులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని