logo

పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు

పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి వైకాపా మూకలు నిప్పుపెట్టారు.

Updated : 22 Apr 2024 10:24 IST

బెల్లంకొండ: పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి వైకాపా మూకలు నిప్పుపెట్టారు. నాయకులు, స్థానికుల కథనం ప్రకారం.. నర్సరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల సోదరి రాణి రుద్రమదేవి ఆదివారం ఎన్నికల ప్రచారం నిమిత్తం నాగిరెడ్డిపాలెంలోని ఎస్టీ కాలనీలో పర్యటించారు. ఈక్రమంలో ఆ పార్టీ శ్రేణులపై వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలు చేపట్టారు. అనంతరం నాగిరెడ్డిపాలెం తెదేపా కార్యాలయం ముందు వైకాపాకు చెందిన 20కి పైగా ప్రచార వాహనాలు నిలిపి భారీ శబ్దాలు చేశారు. ఇదేమని ప్రశ్నించిన నేతలపై వైకాపా మూకలు దాడులకు పాల్పడి రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో పోలీసులు జోక్యం చేసుకుని తెదేపా శ్రేణులను మందలించి బలవంతంగా పంపించేశారు. ఘటన అనంతరం ఆదివారం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో వైకాపా మూకలు తెదేపా కార్యాలయాన్ని తగులబెట్టారు. ఈ ఘటనపై పలువురు తెదేపా నాయకులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని