logo

టిప్పర్‌ డీజిల్‌ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం

చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు.

Published : 17 May 2024 04:51 IST

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంవీఐ నాగలక్ష్మి

చిలకలూరిపేట గ్రామీణ: చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. వేగంగా వచ్చిన బస్సు టిప్పర్‌ డీజిల్‌ ట్యాంక్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా ఆయిల్‌ బస్సు మొత్తం పడటంతో మంటలు వ్యాపించి కాలిపోయినట్లు గుర్తించారు. అగ్నిమాపకశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.జ్ఞానసుందరం, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎస్‌డీ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్‌.శ్రీధర్‌, స్థానిక అగ్నిమాపక అధికారి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించినవారిలో ఉన్నారు.

రోడ్డు పక్కకు బస్సు, టిప్పర్‌: ప్రమాదం సంఘటన ప్రాంతం నుంచి బస్సు ట్రిప్పర్‌ను పక్కకు తరలించారు. వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉండటంతో క్రేన్‌ సాయంతో వాటిని పోలీసులు పక్కన పెట్టించారు. బస్సు సామర్థ్యం తదితర అంశాలను మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగలక్ష్మి పరిశీలించి వివరాలు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని