logo

సినీ థియేటర్లను బతికించండి

నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్‌రాజా పేర్కొన్నారు.

Published : 18 May 2024 05:15 IST

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్‌రాజా పేర్కొన్నారు. పెదరావూరు స్టూడియోలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగిపోయి సినిమాలు ఎక్కువగా విడుదల కాక పోవటం, చిన్న సినిమాలు ఎక్కవగా ఓటీటీలకు పరిమితం కావటం, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా థియేటర్లలో టికెట్ల ధరలు అధికంగా ఉండటం, అన్ని సినిమాలు రోజుల వ్యవధిలోనే ఇంట్లోనే టీవీల్లో చూసే అవకాశం రావటం వంటి కారణాల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. సినీ రంగానికి పునాది వంటి థియేటర్లను బతికించాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను కోరుతున్నట్లు వివరించారు. సమస్యలు, పరిష్కారాల కోసం అధ్యయనానికి సీనియర్లతో కమిటీలు వేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని