logo

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు రూ.10 లక్షల బురిడీ

మాయ మాటలతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను బోల్తా కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది.

Published : 18 May 2024 05:16 IST

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: మాయ మాటలతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను బోల్తా కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీరు ముంబయి నుంచి బుక్‌ చేసిన పార్మిల్‌లో మత్తు పదార్థాలు ఉన్నట్లు స్కానింగ్‌లో తెలిసింది. కేసు నమోదు చేస్తున్నాం. మీరు ముంబయి రావాలని చెప్పారు. తాను ఉండేది తెనాలిలో అని, ముంబయికి అసలు రాలేదని తనకు సంబంధం లేదని యువకుడు సమాధానం ఇచ్చాడు. మీ ఆధార్‌, బ్యాంకు ఖాతా పుస్తకం వివరాలు పంపండి, పరిశీలించి క్లియరెన్స్‌ ఇస్తామని చెబితే యువకుడు అలానే చేశారు. అనంతరం వారు మాటల్లోనే ఉంచి మీ ఖాతాకు మేము రూ.10 లక్షలు వేస్తాం, మీరు తిరిగి మాకు ఆ మొత్తాన్ని పంపండి, కేసు క్లియర్‌ అవుతుందని చెప్పారు. యువకుడి ఖాతాకు వచ్చిన రూ.10 లక్షల మొత్తాన్ని వారు సూచించిన ఖాతాలకు మళ్లించాడు. యావత్తు ప్రక్రియ నడుస్తున్న సమయంలో వారు మాట్లాడుతూనే ఉన్నారు. అనంతరం తన చరవాణి నంబరుకు వచ్చిన సంక్షిప్త సందేశాలను చూస్తే తనకు బ్యాంకు రూ.10 లక్షలు రుణం మంజూరు చేసినట్లు, ఆ మొత్తాన్ని తాను ఇతరుల ఖాతాలకు మళ్లించినట్లు ఉన్నాయి. తాను మోసపోయాయని గ్రహంచిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇటీవల సైబర్‌ విభాగాన్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని