logo

ఈవీఎంల భద్రతపై సమావేశం

జిల్లాల్లో కౌంటింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు.

Published : 18 May 2024 05:21 IST

సమావేశంలో శ్యాంప్రసాద్‌, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి

నరసరావుపేట అర్బన్‌ న్యూస్‌టుడే: జిల్లాల్లో కౌంటింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఈవీఎంల భద్రత, వీవీప్యాట్‌ సురక్షిత నిల్వ తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల అధికారుల, పోలీస్‌ అధికారులు సమావేశంలో ఉన్నారు.

పల్నాడు ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌

నరసరావుపేట అర్బన్‌ న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ శివశంకర్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న శ్యాంప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీ ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని