logo

ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి

ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియం రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ భవన్‌లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు.

Published : 18 May 2024 05:25 IST

ఉత్తరాలు రాసి ప్రదర్శిస్తూ...

పట్టాభిపురం(గుంటూరు): ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియం రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ భవన్‌లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. అశోక్‌ మాట్లాడుతూ ‘నిత్యం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండటం, స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో ఊపిరాడక చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. రెండో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలు ప్రజలకు అందిస్తున్న సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి’.. అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాకర్స్‌ సంఘాలు, విశ్రాంత ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని