logo

పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు.

Updated : 18 May 2024 06:18 IST

ఓ వైకాపా నాయకుడి నిర్వాకం

అమ్మకానికి ఉంచిన మామిడి పండ్లు ఇలా..

కొర్నెపాడు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, అధికారులు వెళ్లే దారి మూసి మామిడి పండ్ల బుట్టలు నిల్వ చేసి అమ్మకాలు చేపట్టారు. దీంతో కార్యాలయంలోకి వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇతరులు వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. పంచాయతీ కార్యాలయంలో ఉంచిన మామిడి కాయలు బయటకు తరలించాలని, గ్రామ కార్యదర్శి కోటేశ్వరికి కొందరు స్థానికులు వినతిపత్రం అందించారు. సమస్యను ఎంపీడీవో శేషగిరిరావు దృష్టికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం పంచాయతీ కార్యాలయానికి సిబ్బందితో కలిసి వెళ్లిన పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరి భవనంలోని మామిడి పండ్లను పూర్తిగా తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని