logo

తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు

ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్‌, ఎన్‌ఎస్‌ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి.

Updated : 18 May 2024 06:16 IST

దుగ్గిరాల, న్యూస్‌టుడే

అమృతమూర్తి... అమ్మ వ్యాసం

ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్‌, ఎన్‌ఎస్‌ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. తెలుగు పాఠ్య పుస్తకంలో గుంటూరు జిల్లా అంశాలు రెండింటికీ చోటు దక్కింది. పొన్నూరు సమీపంలోని మన్నవ గ్రామంలో జన్మించిన అనసూయమ్మ వివాహం తర్వాత జిల్లెళ్లమూడిలో స్థిరపడ్డారు. ఆకలి బాధను తీర్చేందుకు పిడికెడు బియ్యం పథకాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తాము వండుకునే బియ్యంలో నుంచి ఒక పిడికెడు పక్కకు తీసి వాటిని అన్నదానానికి ఇచ్చేవాళ్లు. కొద్ది కాలంలోనే అది ఒక మంత్రంలా పనిచేసి ఆకలి కేకలు లేకుండా చేసింది. విద్య, వైద్యం పేదలందరికీ అందేలా ఆమె కృషి చేశారు. అనాధ శరణాలయం పెట్టి ఆదరిస్తున్నారు. ‘ప్రేమే తత్వం..సేవే మార్గం’ అనే మాటలను గుండె చప్పుడుగా చేసుకున్న ఆమె జీవితాన్ని ‘అమృతమూర్తి...అమ్మ’ పేరిట ఒక వ్యాసంగా ఇచ్చారు. ఈ జిల్లాలోనే చేబ్రోలులో జన్మించిన వాసిరెడ్డి సీతాదేవి రాసిన వ్యాస సంపుటిలో నుంచి ఒక వ్యాసాన్ని ‘ఉపన్యాస కళ’ పేరుతో పాఠంగా ఇచ్చారు. ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ఆమె 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. ఆమె రాసిన మట్టి మనిషి అనే అనే కథను 14 భాషల్లోకి అనువాదం చేశారు.

వాసిరెడ్డి సీతాదేవి ఉన్న పేజి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు