logo

వాడరేవులో రాష్ట్ర గవర్నర్‌

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు.

Published : 18 May 2024 05:34 IST

చీరాల గ్రామీణం, బాపట్ల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతం కావటంతో కలెక్టర్‌ రంజిత్‌బాషా, జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. శనివారం సాయంత్రం వరకు గవర్నర్‌ ఇక్కడే ఉంటారు. డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి

బాపట్ల పట్టణం, న్యూస్‌టుడే: ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా సిబ్బందికి సూచించారు. బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన  స్ట్రాంగ్‌రూమ్‌లను ఆయన శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూములను ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో కలిసి పరిశీలించిన కలెక్టర్‌ ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల ఏర్పాట్లను సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు ఎస్పీ పి.విఠలేశ్వర్‌, డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవోలు గంధం రవీందర్‌, హెలాషారోన్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని