logo

రైతులకు నికర ఆదాయమే లక్ష్యం

కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్‌ సంచాలకుడు డాక్టర్‌ షేక్‌ ఎన్‌.మీరా అన్నారు.

Published : 19 May 2024 05:22 IST

మాట్లాడుతున్న జోన్‌ సంచాలకుడు షేక్‌ ఎన్‌.మీరా, పక్కన శాస్త్రవేత్తలు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్‌ సంచాలకుడు డాక్టర్‌ షేక్‌ ఎన్‌.మీరా అన్నారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో వ్యవసాయ, ఉద్యాన, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని 23 కృషి విజ్ఞాన కేంద్రాల్లో 2024-25 సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్ణయించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అటారి పదో జోన్‌ సంయుక్తంగా రెండు రోజుల కార్యశాల శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన మీరా మాట్లాడుతూ పంటల్లో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సేద్యంలో వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ విస్తరణ సంచాలకులు వై.పద్మలత మాట్లాడుతూ నాణ్యమైన విత్తనోత్పత్తి చేసేలా రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. కేవీకేల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు కరుణశ్రీ, ఎస్‌వీవీయూ విస్తరణ సంచాలకుడు వెంకటనాయుడు, డీడీఏ బాలునాయక్, ఆంగ్రూ పరిశోధన సంచాలకులు ప్రశాంతి, అటారి పదో జోన్‌ శాస్త్రవేత్తలు జె.వి.ప్రసాద్, మాలతి, కేవీకేల ముఖ్య శాస్త్రవేత్తలు, మూడు విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని