logo

మెట్ట ప్రాంతంలో తీరిన దాహం

చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది.

Published : 19 May 2024 05:26 IST

నిండిన చెక్‌ డ్యాంలు 

రేమిడిచర్ల కుంటలో వర్షపు నీరు 

చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. రేమిడిచర్ల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీటితో చెక్‌ డ్యాంలు నిండి పొంగి పొర్లాయి. గుమ్మనంపాడు  సమీపంలో చెక్‌ డ్యాం వద్ద ఓ రైతు కట్టను ఆక్రమించడంతో నీటి ఉద్ధృతికి కట్ట తెగిపోయి గుమ్మనంపాడులోని పలు ఇళ్లల్లోకి నీరు చేరింది. గరికపాడు గ్రామ సమీపంలోని ప్రధాన దేవాలయంలోకి నీరు చేరింది. పత్తి సాగుకు అనుకూలమైన సమయంలో పదునైన వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బొల్లాపల్లి, న్యూస్‌టుడే

బొల్లాపల్లి మండలం గరికపాడు వద్ద వరద నీటి ఉద్ధ ృతి

గుమ్మనంపాడులో ఉద్ధ ృతంగా ప్రవహిస్తున్న వాగు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని