logo

ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ

సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్‌(జీవశాస్త్రం), సోషల్‌ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు.

Published : 19 May 2024 05:39 IST

గుంటూరు, న్యూస్‌టుడే: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్‌(జీవశాస్త్రం), సోషల్‌ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా పాఠ్యాంశాల ప్రణాళిక పక్కాగా తయారుచేసుకుని అమలు చేయాలన్నారు. ఈ శిక్షణ ద్వారా బోధన నైపుణ్యాలు మెరగవుతాయన్నారు. ఈనెల 20, 21 తేదీల్లో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పరిశీలకులు సుహాసిని, మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, ఎల్‌ఎఫ్‌ఈ సమన్వయకర్త తోట వీరయ్య, సీబీఎస్‌ఈ స్కూల్‌ జిల్లా ఇన్‌ఛార్జి గుత్తా శ్రీనివాసరావు, హెచ్‌ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని