logo

ఎట్టకేలకు కదిలిన అధికారులు

ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.

Published : 19 May 2024 05:45 IST

ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న అధికారుల బృందం

అమరావతి, న్యూస్‌టుడే: ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. అమరావతి మండలం మల్లాది (దిడుగు) రెవెన్యూ పరిధిలోని ఇసుక రీచ్‌ను శనివారం సందర్శించారు. భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ, సెబ్, నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల అధికారులు ఇసుక రీచ్‌ పరిశీలించారు. అక్కడ జరిగిన తవ్వకాలు, అనుమతులు, తవ్విన హద్దుల కొలతలు తీశారు. ఆదివారం వైకుంఠపురం ఇసుక రీచ్‌ను పరిశీలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని