logo

పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్‌ లట్కర్‌

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ లట్కర్‌ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్‌గా ఉన్న శివశంకర్‌ను ఎన్నికల కమిషన్‌ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Published : 19 May 2024 05:47 IST

నరసరావుపేట టౌన్, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ లట్కర్‌ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్‌గా ఉన్న శివశంకర్‌ను ఎన్నికల కమిషన్‌ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నూతన కలెక్టర్‌గా శ్రీకేశ్‌లట్కర్‌ను నియమించింది. 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీకేశ్‌ ఏపీ ఆగ్రోస్‌కు ఉపాధ్యక్షులుగా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పురపాలక పాలనా విభాగం కమిషనర్‌గా ఉన్నారు.


ఎస్పీగా మలికా గార్గ్‌

పల్నాడు ఎస్పీగా మలికాగార్గ్‌ నియమితులయ్యారు. శనివారం ఈమేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందు ఆమె ప్రకాశం, తిరుపతి జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. 2015 ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన మలికా గార్గ్‌ ముక్కుసూటి మనిషిగా పేరొందారు. కృష్ణా జిల్లా అడిషనల్‌ ఎస్పీగా పనిచేశారు. 2021లో ప్రకాశం ఎస్పీగా నియమితులయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం నుంచి తిరుపతికి బదిలీ చేశారు. అరాచకాలను అడ్డుకుంటూ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేస్తారనే పేరుండడంతో ఆమె తిరుపతి జిల్లా ఎస్పీగా కేవలం వారం మాత్రమే పనిచేశారు. వైకాపా ప్రభుత్వం ఆమెను అక్కడి నుంచి సీఐడీకి బదిలీ చేసింది. ప్రస్తుతం సీఐడీ నుంచి జిల్లాకు ఎస్పీగా వస్తున్నారు. ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమె భర్త వకుల్‌జిందాల్‌ బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని