logo

మద్యం దుకాణాలకు 144 సెక్షన్‌ వర్తించదా?

ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు.

Published : 19 May 2024 05:49 IST

దాచేపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, వైకాపా నాయకులకు చెందిన బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మాత్రం వదిలేస్తున్నారు. మద్యం మత్తులోనే ఎక్కువగా గొడవలు జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. నిత్యావసర దుకాణాలకు వర్తించిన 144 సెక్షన్‌ మద్యం దుకాణాలకు వర్తించదా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని