logo

గుండ్లకమ్మ చుట్టూ ఇసుక దొంగలే

ఇసుక దొంగలకు దోచిపెట్టేందుకే గుండ్లకమ్మ నది అన్నట్లు పరిస్థితి ఉందని, అనుమతి లేని తవ్వకాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ అన్నారు.

Published : 21 May 2024 04:04 IST

అక్రమ తవ్వకాలను నియంత్రించాల్సిందేనన్న జేసీ శ్రీధర్‌

అద్దంకి, న్యూస్‌టుడే: ఇసుక దొంగలకు దోచిపెట్టేందుకే గుండ్లకమ్మ నది అన్నట్లు పరిస్థితి ఉందని, అనుమతి లేని తవ్వకాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ అన్నారు. అద్దంకి పరిధిలో గుండ్లకమ్మ పరివాహకాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. చీరాల ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి, అద్దంకి తహసీల్దార్‌ మహబూబ్‌ సుభానీ, ఇతర శాఖల సిబ్బంది సమక్షంలో ఇసుక తవ్వకాలు జరిగిన ప్రదేశాలను నిశితంగా పరిశీలించారు. గుండ్లకమ్మ వంతెనకు ఉత్తరం వైపు రాత్రివేళల్లో జరుగుతున్న తవ్వకాలు, దీనికి సంబంధించి ఇసుక నిల్వలు, జల్లెడలు, నీటి డబ్బాలను అధికారుల బృందం స్వయంగా పరిశీలించింది. అనంతరం వంతెన పైనుంచి దక్షిణం వైపు నదిలో జరిపిన తవ్వకాలు చూశారు. ఇంత దారుణంగా తవ్వేస్తున్నా యంత్రాంగం ఏం చేస్తోందంటూ స్థానిక అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణం రెవెన్యూ, పోలీసు, సెబ్, నీటిపారుదల, గ్రామ పంచాయతీ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని చీరాల ఆర్డీవోకి సూచించారు.


సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..

సుక అవసరాలు తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై జేసీ శ్రీధర్‌ విచారించారు. గుండ్లకమ్మ నదిలో రామాయపాలెం పంచాయతీ ఆధీనంలోని భూమిలో తవ్వకాలకు 1.10 ఎకరాలు గుర్తించి, అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారని మైనింగ్‌ అధికారులు జేసీకి చెప్పారు. ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వని కారణంగా ఇసుక నిల్వలు మెండుగా ఉన్న ప్రాంతాల నుంచి తవ్వకాలకు అనుమతి ఇచ్చేలా చూడాలని జేసీ సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని