logo

జాతీయ సేవకుల కోసం

జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్‌ సర్వీసెస్‌ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్‌ యూనియన్‌ ఫర్‌ నేషన్‌(సన్‌), కేవీఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌.

Published : 21 May 2024 04:19 IST

సన్, కేవీఆర్‌ సంస్థల ఆధ్వర్యంలో ఐఏఎస్‌ ఫౌండేషన్‌ కోర్సు
నవభారత్‌నగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే 

జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్‌ సర్వీసెస్‌ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్‌ యూనియన్‌ ఫర్‌ నేషన్‌(సన్‌), కేవీఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌. వాటి సంయుక్త ఆధ్వర్యంలో 2014 నుంచి పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచితంగా పదిరోజులపాటు ఐఏఎస్‌ ఫౌండేషన్‌ ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు.

నేటి నుంచి ప్రారంభం

గుంటూరు బ్రాడీపేట 2/6లో యూటీఎఫ్‌ కార్యాలయంలో ఈ ఉచిత తరగతులు నిర్వహిస్తారు. 8వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్నవారు హాజరు కావచ్చు. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. వివరాలకు 72075 66702, 63094 81514, 81435 29978, 8688 97406 నంబర్లకు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షతోపాటు గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు కావాల్సిన అర్హలతోపాటు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో ఈ పది రోజుల శిక్షణలో విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పిస్తారు. 


పాఠశాల విద్యార్థులే లక్ష్యం

- కె.ఎస్‌.లక్ష్మణరావు, ఎమ్మెల్సీ, పోటీ పరీక్షల నిపుణులు

వెనుకబడిన రాష్ట్రాలుగా చెబుతున్న ఒడిశా, బిహార్‌ నుంచి జాతీయ స్థాయి పరీక్షలకు ఎక్కువ మంది హాజరుకావడమే కాకుండా ఎక్కువ మంది ఎంపికవుతున్నారు. మన రాష్ట్రం నుంచి చాలా తక్కువ మంది విజేతలుగా నిలుస్తున్నారు. దీనికి కారణం కెరీర్‌ ఆప్షన్‌ చాలా పరిమితంగా ఉండటమే. పాఠశాల స్థాయికి చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 2014 నుంచి (2020,21 తప్ప) ఈ ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతులను నిర్వహిస్తున్నాం. సిలబస్‌ విశ్లేషణతోపాటు నిత్యం వార్తా పత్రికలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివే అలవాటు చేయడమే మా లక్ష్యం.


నా ప్రయాణం ఇక్కడి నుంచే...

- కొండా యుగకీర్తి, ఎంపీడీవో, ప్రకాశం జిల్లా 

సన్‌లో 2015లో వాలంటీర్‌గా చేరాను. ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతులకు హాజయ్యాను. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో శిక్షణ ద్వారా అర్థమైంది. ఒకవైపు వాలంటీర్‌గా సేవలు అందిస్తూనే ఈ శిక్షణ తరగతులకు వెళ్లాను. విజ్ఞాన్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తిచేసి, ఆ స్ఫూర్తితో గ్రూప్‌-1 (2018) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపీˆడీవోగా ఎంపికయ్యాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని