logo

గుంటూరు పశ్చిమ పోస్టల్‌ బ్యాలట్ల గది మార్పు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్ల గదిని అధికారులు ఎట్టకేలకు మార్చారు. ఈ నెల 19వ తేదీన ‘ఈనాడు’ లో ‘పోస్టల్‌ బ్యాలట్లకు భద్రత ఏది’... శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎన్నికల అధికారుల్లో కదలిక వచ్చింది.

Published : 21 May 2024 04:22 IST

పట్టాభిపురం (గుంటూ రు), న్యూస్‌టుడే :   గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్ల గదిని అధికారులు ఎట్టకేలకు మార్చారు. ఈ నెల 19వ తేదీన ‘ఈనాడు’ లో ‘పోస్టల్‌ బ్యాలట్లకు భద్రత ఏది’... శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎన్నికల అధికారుల్లో కదలిక వచ్చింది. పోస్టల్‌ బ్యాలట్లు ఉంచిన బాక్సులను గుంటూరు నగరపాలక సంస్థలోని అల్యూమినియం పార్టీషన్‌ చేసిన అద్దాల గదిలో ఉంచి అదే స్ట్రాంగ్‌ రూమ్‌గా మలచి అధికారులు చేతులు దులుపుకొన్నారని ‘ఈనాడు’లో కథనం రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ గదిలో నుంచి పోస్టల్‌ బ్యాలట్ల బాక్సులను మార్చాలని తెదేపా నాయకులు కూడా పట్టుబట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమని భద్రతా సిబ్బందే చెబుతున్నారని గుర్తు చేశారు.

గుంటూరు తూర్పునకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలట్లు మాత్రం ఆర్‌సీసీ బిల్డింగ్‌ భవనంలో భద్రపరచి గుంటూరు పశ్చిమానికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలట్లపై ఎందుకు వివక్ష చూపుతున్నారని తెదేపా నేతలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఎన్నికల అధికారులు వివిధ రాజకీయ పక్షాల నేతల సమక్షంలో అద్దాల గదిలో ఉన్న పోస్టల్‌ బ్యాలట్ల పెట్టెల్ని కార్పొరేషన్‌ ఖజానా గదిలోకి మార్చారు. గది మార్చాలని పట్టుబట్టడం మంచిదైందని, లేదంటే పోస్టల్‌ బ్యాలట్ల బాక్సులకు తాళాలు వేసి సీలు వేయకుండా అంతే అధికారులు వదిలివేసే వారని తెదేపా నాయకులు వాపోయారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు నాయకులు నాయుడు ఓంకార్, పరుచూరి సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ఓట్ల వివరాలు  ఇలా ఉన్నాయి .                                          

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని