logo

ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షణ

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు.

Published : 21 May 2024 04:25 IST

కొల్లిపర, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. ఆయన, జిల్లా ఎస్పీ తుషార్‌ దూడి, సంయుక్త కలెక్టర్‌ రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్, సహాయ కలెక్టర్‌ (శిక్షణ) పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్, ఇసుక కమిటీ ప్రతినిధులు సోమవారం కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, మున్నంగి ఇసుక రీచ్‌లను పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించారు. నిబంధనల అమలుకు పక్కాగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సాగాలని సూచించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై జిల్లా స్థాయిలో 24 గంటలూ పని చేసేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదులను ‘0863-2234301’ నంబరుకు తెలియచేయవచ్చని కలెక్టర్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని