logo

వైకాపా నాయకులకు గుణపాఠం చెప్పాలి

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో జరిగిన రేవ్‌ పార్టీ ఘటనలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ప్రమేయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్‌ చేశారు.

Published : 21 May 2024 04:26 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో జరిగిన రేవ్‌ పార్టీ ఘటనలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ప్రమేయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని గంజాయి తయారు చేసే పరిశ్రమగా చేసిన వైకాపా నేతలు ఇతర రాష్ట్రాలను కూడా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు 1,616వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్లూరులో నిరసనలు చేస్తున్న రైతులు మాట్లాడుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులకు భోజనం తయారు చేసుకోవడానికి స్థలం, బయో టాయిలెట్లు లేకుండా చేసిన మంత్రి కాకాణికి తగిన శాస్తి జరగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవ్‌ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌ కొకైన్‌ లభ్యం కావడం కలకలం రేపుతోందన్నారు. చంద్రబాబు సతీమణి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ మోహన్‌ను కూడా శిక్షించాలని పేర్కొన్నారు. అధికార మదంతో విర్రవీగిన వైకాపా నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆక్రోశం వెళ్లగక్కారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని