logo

బాధ చూడరు.. బాగు చేయరు..

జీజీహెచ్‌ అత్యవసర కేంద్రం నుంచి ఇలా రోగులను స్ట్రెచర్‌ మీద తీసుకెళ్తున్నది సీటీ స్కాన్‌ కేంద్రానికి.

Published : 21 May 2024 04:30 IST

ఈనాడు గుంటూరు, న్యూస్‌టుడే, నగరంపాలెం: జీజీహెచ్‌ అత్యవసర కేంద్రం నుంచి ఇలా రోగులను స్ట్రెచర్‌ మీద తీసుకెళ్తున్నది సీటీ స్కాన్‌ కేంద్రానికి. గుంటూరు జీజీహెచ్‌లో ఏడాదికి పైగా నుంచి సీటీ స్కాన్‌ పనిచేయక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జీజీహెచ్‌ ప్రాంగణంలోని నాట్కో కేంద్రంలో క్యాన్సర్‌ రోగులకు ఉపయోగించే సీటీ సిమ్యులేటర్‌ వద్దకు సీటీ స్కాన్‌ అవసరమైన రోగులను తరలిస్తున్నారు. రోజుకు పదిలోపు క్యాన్సర్‌ రోగులకు ఉపయోగించే ఈ పరికరం వద్దకు నిత్యం వందకు పైగా కేసులు పంపడంతో లోడ్‌ ఎక్కువై పనిచేయక పలుమార్లు మొరాయిస్తోంది. దీంతో రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అత్యవసర వార్డుల నుంచి దూరంగా ఉన్న నాట్కో కేంద్రంలోని సిటీ సిమ్యులేటర్‌ వరకు రాళ్లు తేలిన దారిలో తరలిస్తుంటే రోగులు విలవిల్లాడుతున్నారు. అక్కడ గంటల తరబడి వేచి ఉంటేకాని సీటీ స్కాన్‌ తీయలేని పరిస్థితి నెలకొంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని