logo

పోలీసుల ఉదాసీనతతోనే హత్యాయత్నం: జీవీ

గతంలో బాలకోటిరెడ్డిపై కత్తులతో దాడి జరిగినపుడు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరాం.. మళ్లీ దాడి చేశారు.. దీనికి పోలీసుల ఉదాసీనతే కారణమని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 04:32 IST

ఆసుపత్రిలో బాలకోటిరెడ్డిని పరామర్శిస్తున్న జీవీ ఆంజనేయులు, డాక్టర్‌ అరవిందబాబు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: గతంలో బాలకోటిరెడ్డిపై కత్తులతో దాడి జరిగినపుడు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరాం.. మళ్లీ దాడి చేశారు.. దీనికి పోలీసుల ఉదాసీనతే కారణమని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. రొంపిచర్ల మండలం అలవాలలో ఇటీవల కాల్పులకు గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న వెన్నా బాలకోటిరెడ్డిని శనివారం జీవీ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తుపాకుల సంస్కృతిని తెచ్చారని మండిపడ్డారు. గతంలో బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే వైకాపా నేతల ప్రమేయంతో నిందితులు కాల్పులకు తెగబడ్డారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో 17 హత్యలు, 200లకు పైగా దాడులు జరిగాయన్నారు. వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసులు వారికి వంత పాడుతున్నారన్నారు. కాల్పుల ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే తెదేపా నాయకులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. నేతల వెంట కుమ్మెత కోటిరెడ్డి, కొట్టా కిరణ్‌, తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని