logo

చెరువు మట్టి దోపిడీ.. వైకాపా నేతల్లో విభేదాలు

మండలంలోని ములకలూరు సాగునీటి చెరువులో మట్టి దోపిడీ వ్యవహారం అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య విబేధాలకు దారి తీసింది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తున్న చెరువులో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.

Published : 05 Dec 2023 02:27 IST

నరసరావుపేట టౌన్‌: మండలంలోని ములకలూరు సాగునీటి చెరువులో మట్టి దోపిడీ వ్యవహారం అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య విబేధాలకు దారి తీసింది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తున్న చెరువులో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఈ విషయంలో తొలి నుంచి పెత్తనం చలాయిస్తున్న అసమ్మతి వర్గ నేతలను కాదని వారి వ్యతిరేక వర్గీయులు మట్టి తవ్వకాలకు యంత్రాలు, వాహనాలు ఏర్పాటు చేశాఉ. దీంతో వారిపై అసమ్మతి వర్గ నాయకుడొకరు కన్నెర్ర చేశారు. శనివారం రాత్రి పెట్రోలు డబ్బా తీసుకెళ్లి యంత్రాలను తగులబెడతానని హెచ్చరించారు. ఇది ఉభయ వర్గీయుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఒక దశలో ఘర్షణకు సిద్ధమయ్యారు. నరసరావుపేట గ్రామీణ ఎస్సై రోశయ్య వెళ్లి వారిని చెదరగొట్టారు. చెరువులోని యంత్రాలు, ట్రాక్టర్లను బయటకు పంపించారు. తాత్కాలికంగా వివాదాన్ని సద్దుమణిగించారు. గ్రామంలో ఘర్షణ జరగలేదని, వాహనాలను పంపించి వేయడంతో ఆ వివాదం సమిసిపోయిందని ఎస్సై సోమవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని