logo

తప్పుల తడకగా ముసాయిదా జాబితా

సరైన వివరాలు లేని ఓటర్ల జాబితాలతో ప్రజాస్వామ్యం మనుగడ, ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 05 Dec 2023 02:31 IST

మాట్లాడుతున్న  మాజీమంత్రి  పుల్లారావు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : సరైన వివరాలు లేని ఓటర్ల జాబితాలతో ప్రజాస్వామ్యం మనుగడ, ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో మృతుల ఓట్లు, డబుల్‌ ఎంట్రీలు, ఒకే ఇంటి నంబరుతో అధిక ఓట్లే ఇందుకు నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అభ్యంతరాలు అపరిష్కృతంగా ఉండగానే అసలు ముసాయిదాను ఎలా ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియపైనే ఇది అనుమానాలు రేకెత్తించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలు, వెలుగుచూస్తూనే ఉన్నాయన్నారు. వీటిపై ఆధారాలతో పదే పదే ఫిర్యాదులు ఇస్తున్నా ఎన్నికల అధికారులు వాటిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాల సానుభూతి ఓటర్లకు సమాచారం ఇవ్వకుండా ఓటు హక్కు తీసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు తప్పుడు దరఖాస్తులు అందజేసినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని