logo

జగన్‌ కేసుల మాఫీకి రాష్ట్ర ప్రయోజనాలు మోదీకి తాకట్టు

జగన్‌.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్‌ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Published : 05 Dec 2023 02:33 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

చలో దిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించిన నారాయణ, ఐకాస, వివిధ పార్టీల నాయకులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: జగన్‌.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్‌ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నరేంద్ర మోదీని సీఎం జగన్‌ లెక్కలేనన్ని సార్లు కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు గురించి ప్రస్తావన తీసుకొచ్చే ధైర్యం లేదు. పోలవరం ప్రాజెక్టు నిధులు, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీల కోసం పోరాడే తెగువ లేదు. ఆంధ్రుల విరోధి మోదీ. ఇతర రాష్ట్రాలపై ఉన్న ప్రేమ ఆయనకు ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం లేదు. ప్రజా ప్రయోజనాలు మరచిపోయి ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలు ఓడించారు. అదేవిధంగా జగన్‌ను కూడా ఓడిస్తారు’.. అని పేర్కొన్నారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగే కార్యక్రమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు నూనె పవన్‌తేజ, సీపీఐ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని