logo

ప్రజావ్యతిరేక పాలనతో పతనం తప్పదు

ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించిన ఏ పార్టీకైనా పతనం తప్పదని రాజధాని రైతులు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటమే దానికి నిదర్శనమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు సోమవారానికి 1,448వ రోజుకు చేరాయి.

Updated : 05 Dec 2023 06:00 IST

శిబిరంలో రైతుల నిరసన

తుళ్లూరు, న్యూస్‌టుడే: ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించిన ఏ పార్టీకైనా పతనం తప్పదని రాజధాని రైతులు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటమే దానికి నిదర్శనమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు సోమవారానికి 1,448వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మందడం శిబిరంలో రైతులు మాట్లాడుతూ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ప్రజలు కోరుకుంటుంటే సీఎం జగన్‌ మాత్రం మూడు రాజధానులంటూ మూర్ఖంగా ముందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో దౌర్జన్య పాలన చేస్తూ అభివృద్ధిని పట్టించుకోని వైకాపాకు రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని