logo

రైతుల అవసరాలు తీర్చడానికే ఆర్‌బీకేలు

విత్తడానికి ముందు నుంచి.. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత వాటిని విక్రయించుకునే వరకు రైతులకు సహాయం చేసి వారి అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర సహకార, మార్కెటింగ్‌ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Published : 05 Dec 2023 02:35 IST

 

మాట్లాడుతున్న బత్తుల బ్రహ్మానందరెడ్డి, వేదికపై   ఆంగ్రూ వీసీ శారద జయలక్ష్మీదేవి తదితరులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: విత్తడానికి ముందు నుంచి.. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత వాటిని విక్రయించుకునే వరకు రైతులకు సహాయం చేసి వారి అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర సహకార, మార్కెటింగ్‌ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో సోమవారం జరిగిన అగ్రిటెక్‌ రెండో రోజు సదస్సుకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతు పండించిన పంటను అనుకూలమైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవడానికి గోడౌన్లను కూడా ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నవారిని ప్రోత్సహించాలన్నారు. తుపాను ప్రభావంతో సోమవారం కురిసిన వర్షంతో అగ్రిటెక్‌కి రైతులు తక్కువ మంది హాజరయ్యారు. కుంకుమ పువ్వు, మిర్చి సాగుతో పాటు చేపల పెంపకం, డ్రోన్లతో పురుగు మందుల పిచికారీ గురించి చర్చించారు. సమావేశంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు ఎల్‌.నారంనాయుడు, ఆంగ్రూ డీఆర్‌ ఎల్‌.ప్రశాంతి, శ్రీవెంకటేశ్వర పశు పరిశోధన స్థానం సంచాలకుడు ముత్తారావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు అగ్రిటెక్‌ని సందర్శించి ప్రదర్శనలో ఉంచిన వ్యవసాయ యంత్ర పరికరాలను పరిశీలించారు. మంగళవారంతో అగ్రిటెక్‌ ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని