logo

ఆ రెండు గ్రామాలకు పెనుముప్పు!

మండల పరిధిలోని దానవాయిపేట, సూర్యలంక గ్రామాలు సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. సముద్రం నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే రెండు గ్రామాలు ఉండటంతో స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

Published : 05 Dec 2023 02:40 IST

తీరానికి అత్యంత దగ్గరగా దానవాయిపేట, సూర్యలంక

  సముద్రానికి వంద మీటర్ల దూరంలో దానవాయిపేట మత్స్యకారుల కాలనీ

బాపట్ల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని దానవాయిపేట, సూర్యలంక గ్రామాలు సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. సముద్రం నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే రెండు గ్రామాలు ఉండటంతో స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సూర్యలంక గిరిజనులకు స్థానిక తుపాను రక్షిత భవనంలో, దానవాయిపేట వాసులకు అడవిపల్లెపాలెం ఏఎంజీ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్డీవో రవీందర్‌, డీఎస్పీ వెంకటేశులు, తహసీల్దారు సుధారాణి దానవాయిపేట వెళ్లి స్థానిక 350 మంది మత్స్యకారులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలించారు. పలువురు ఇళ్లకు తాళాలు వేసి రావటానికి నిరాకరించగా వారికి ఆర్డీవో, డీఎస్పీ తుపాను తీవ్రతను వివరించి పునరావాస కేంద్రానికి రావాలని నచ్చచెప్పి తీసుకెళ్లారు. తుపాను ప్రభావంతో అలలు విరుచుకుపడితే రెండు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించటానికి అధికారులు వాహనాలు సిద్ధం చేశారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న వారికి ఆహారం, తాగునీరు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు