logo

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

మిగ్‌జాం తుపాన్‌ నేపథ్యంలో చినగంజాం మండలోని 12 గ్రామపంచాయతీలకు సుమారు 15 గంటలనుంచి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం నుంచి 13కేవీ, 11కేవీ విద్యుత్‌ స్తంభాలవద్ద ఇన్సులేషన్‌ లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది ట్రాన్స్‌ కో ఏఈ పడవల గణనారాయణ తెలిపారు.

Updated : 05 Dec 2023 05:48 IST

చినగంజాం: మిగ్‌జాం తుపాన్‌ నేపథ్యంలో చినగంజాం మండలోని 12 గ్రామపంచాయతీలకు సుమారు 15 గంటలనుంచి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం నుంచి 13కేవీ, 11కేవీ విద్యుత్‌ స్తంభాలవద్ద ఇన్సులేషన్‌ లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల విద్యుత్‌ అంతరాయం ఏర్పడినట్లు ట్రాన్స్‌కో ఏఈ పడవల గణనారాయణ తెలిపారు. చీరాల, ఇంకోలు గ్రామలనుంచి రావాల్సిన విద్యుత్‌లైన్‌లో బ్రేక్‌లు పడడంతో రెండు బృందాలుగా ఏర్పడి లోపాలను సవరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వర్షాలు వల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. 

తుపాన్‌ కారణంగా మహాలక్ష్మీ ఎస్టీ కాలనీ పూరిగుడిసెల్లో ఉన్న 27 కుటుంబాలను చినగంజాంలోని జడ్పీపాఠశాలలోని పునరావాసకాలనీకి తరలించినట్లు ఎమ్మార్వో పార్వతి, ఎస్సై సురేస్‌ తెలిపారు. సోమవారం రాత్రి జాయంట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌, ఆర్డీవో సరోజనీ, మండల అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని