logo

తడిసిన ధాన్యాన్నీ కొనాల్సిందే: మాజీ మంత్రి

Published : 07 Dec 2023 04:53 IST

కొల్లూరు, న్యూస్‌టుడే: వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు. మండలంలోని క్రాపలో నీట మునిగిన వరి పొలాలను మోకాలి లోతు నీటిలో దిగి ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతికొచ్చిన ధాన్యం తుపాను ప్రభావంతో నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపినా ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మురుగు కాల్వల్లో పూడిక తీస్తే కొంతమేర నష్టం తగ్గేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన వారికి హెక్టారుకు రూ.20వేలు ఇచ్చామని తెలిపారు. పంట నష్టపోయిన కౌలు రైతులకు హెక్టారుకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే కేంద్రాలు తెరిచి ధాన్యం కొనాలన్నారు. అధికారులు సమగ్ర సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పట్టిసీమ ద్వారా ముందుగానే సాగు నీరు అందిస్తే తుపాను నుంచి రైతులు పంటలతో బయటపడేవారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని