logo

రైతులకు పరిహారం చెల్లించాలి

మిగ్‌జాం తుపాను ధాటికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. సంతమాగులూరు మండలంలో బుధవారం ఆయన పర్యటించారు.

Published : 07 Dec 2023 05:03 IST

ఎమ్మెల్యే గొట్టిపాటి డిమాండ్‌

కొమ్మాలపాడు (సంతమాగులూరు): మిగ్‌జాం తుపాను ధాటికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. సంతమాగులూరు మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం, మామిళ్లపల్లి గ్రామాల పరిధిలో దెబ్బతిన్న మిరప, పూలతోటలు, శనగ, అరటి తోటల్ని పరిశీలించారు. ఎడతెరిపి లేని వర్షం, పెనుగాలులతో వరి, మొక్కజొన్న, శనగ, పూలతోటలు, మిరప రైతులు భారీగా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. మిరప, అరటి పూలతోటల సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.లక్ష వంతున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వరి, మొక్కజొన్న రైతులకు రూ.50 వేల వంతున, శనగ రైతులకు రూ.20 వేల వంతున పరిహారం అందించాలని కోరారు. నష్టం అంచనాలు వేసే సమయంలో వాస్తవ సాగుదారులకు అన్యాయం జరగకుండా నివేదికలు తయారు చేసి పరిహారం అందేలా చూడాలని వ్యవసాయ అధికారులను సూచించారు. ఈ-క్రాఫ్‌ నమోదు విషయంలో అశ్రద్ధగా వ్యవహరించిన క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశీలనలో మండల వ్యవసాయాధికారిణి ఆర్‌.లావణ్య, తెదేపా నాయకులు తేలప్రోలు రమేష్‌, మాజీ ఎంపీపీ సన్నెబోయిన ఏడుకొండలు, హఫీజ్‌, కొణికి శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని