logo

మిగ్‌జాం బీభత్సం

మిగ్‌జాం తుపాను తీరం దాటిన తర్వాత బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్‌లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో అవి తెగి స్తంభాలు నేలకొరిగాయి. దీంతో బుధవారం ఉదయాన్నే అగ్నిమాపక సిబ్బంది చెట్ల కొమ్మలను విద్యుత్తు స్తంభాలకు అడ్డం లేకుండా తొలగించారు.

Published : 07 Dec 2023 05:10 IST

కలెక్టరేట్‌లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను తీరం దాటిన తర్వాత బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్‌లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో అవి తెగి స్తంభాలు నేలకొరిగాయి. దీంతో బుధవారం ఉదయాన్నే అగ్నిమాపక సిబ్బంది చెట్ల కొమ్మలను విద్యుత్తు స్తంభాలకు అడ్డం లేకుండా తొలగించారు. వెంటనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే పనులు చేపట్టారు. కలెక్టరేట్‌లోని సర్వే, వ్యవసాయం, మత్స్య, అటవీ శాఖ రేంజ్‌ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆయా కార్యాలయాల్లో ఉద్యోగులు విద్యుత్తు సరఫరా కోసం ఎదురుచూడసాగారు. గురువారం ఉదయానికి సరఫరాను పునరుద్ధరిస్తామని సిబ్బంది తెలిపినట్లు పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని