logo

అంతర్జాతీయ శాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో ప్రథమ స్థానం

ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్‌పూరి చంద్రబాగ్‌ బీచ్‌లో ఈ నెల ఒకటి నుంచి అయిదు వరకు జరిగిన అంతర్జాతీయ శాండ్‌ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరానికి...

Published : 07 Dec 2023 05:14 IST

 

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్‌పూరి చంద్రబాగ్‌ బీచ్‌లో ఈ నెల ఒకటి నుంచి అయిదు వరకు జరిగిన అంతర్జాతీయ శాండ్‌ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరానికి చెందిన బాలాజీ వరప్రసాద్‌ పోటీలో పాల్గొని అయిదు రోజుల పాటు ఎకో టూరిజం, మహిళా సాధికారత, అతిథి దేవోభవ తదితర సందేశాత్మక సైకత శిల్పాలు రూపొందించారు. ఇందుకు గానూ బుధవారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రథమస్థానం లభించినట్లు చిత్రకారుడు ‘న్యూస్‌టుడే’కు చరవాణి ద్వారా తెలిపారు. 2018, 2022లో ఆయన రాష్ట్రం తరఫున పోటీలో పాల్గొని రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని