logo

జగనన్న కాలనీకి పడవలో వెళ్లాల్సిందేనా!

జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలంటూ అధికారులు లబ్ధిదారుల వెంటపడ్డారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కాలనీ జలమయమైంది.

Published : 07 Dec 2023 05:23 IST

కొల్లూరు, న్యూస్‌టుడే: జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలంటూ అధికారులు లబ్ధిదారుల వెంటపడ్డారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కాలనీ జలమయమైంది. ఇళ్లు నిర్మించుకున్న వారు కాలనీలోకి వెళ్లాలంటే నడుము లోతు నీరు ఉండటంతో పడవలు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మండలంలో చినపులివర్రు జగనన్నకాలనీ పరిస్థితి. కాలనీలో మెరకలు వేయలేదు. రహదారులు లేవు. అయినా అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లు నిర్మించుకున్నారు. భారీ వర్షాలకు నీరు కాలనీని చుట్టుముట్టింది. కొందరు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి తెచ్చుకున్న సిమెంటు, ఇనుము, ఇసుక నీటిపాలయ్యాయి. కనీస వసతులు లేకుండా లబ్ధిదారులు ఎలా జీవనం సాగిస్తారనే విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించడం లేదు. ఇళ్లు లేని నిరుపేదలు అద్దె ఇంటికి బాడుగ చెల్లించలేక సొంత ఇళ్లు నిర్మించుకొన్నారు. ఆ ఇళ్లు చూసి సంతోషపడటమే తప్ప నివాసం ఉండలేకపోతున్నారు. రాత్రి సమయాల్లో పాములు తిరుగుతున్నాయని తాము ఎలా నివాసం ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో మెరకలు వేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మూడడుగుల లోతు నీటిలో కాలనీలోకి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. కాలనీ ఏర్పాటు సమయంలోనే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని అధికారులు మెరకలు వేయాల్సి ఉంది. ముందుచూపు కొరవడిన అధికారులు పల్లపు ప్రాంతాల్లో ఉన్న పొలాలను అధికార పార్టీ నాయకుల ప్రయోజనాల కోసం కొనుగోలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని