logo

వార్డు సచివాలయంపై వైకాపా జెండా!

బాపట్ల 10వ వార్డు సచివాలయ భవనంపై వైకాపా జెండా ఏర్పాటు చేయడాన్ని తెదేపా బాపట్ల బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయంపై ఎమ్మెల్యే కోన రఘుపతి చిత్రంతో ఉన్న వైకాపా జెండాను ఏర్పాటు చేశారని,...

Published : 07 Dec 2023 05:24 IST

బాపట్ల (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: బాపట్ల 10వ వార్డు సచివాలయ భవనంపై వైకాపా జెండా ఏర్పాటు చేయడాన్ని తెదేపా బాపట్ల బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయంపై ఎమ్మెల్యే కోన రఘుపతి చిత్రంతో ఉన్న వైకాపా జెండాను ఏర్పాటు చేశారని, ఇది అభ్యంతరకరమన్నారు. పరిపాలన వ్యవస్థను అధికార పార్టీ తమ స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం సమంజసం కాదన్నారు. అధికార పార్టీ జెండాలపై ఉన్న ఆసక్తి పారిశుద్ధ్యం మెరుగు పరిచే విషయంలో చూపడం లేదని అధికారులను దుయ్యబట్టారు. ప్రజలకు సేవలందించడానికే ప్రభుత్వ ఉద్యోగమని, వైకాపా నేతలకు భజన చేయడానికి కాదనే విషయాన్ని అధికారులు గుర్తెరగాలని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని