logo

యువకులను కాపాడిన పోలీసులు

పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లెక్క చేయకుండా కారులో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను అద్దంకి పోలీసులు కాపాడారు. ఈ సంఘటన అద్దంకి నుంచి రేణంగివరం వెళ్లే దారిలో నల్లవాగు వద్ద మంగళవారం ఆర్ధరాత్రి దాటాక జరిగింది.

Published : 07 Dec 2023 05:27 IST

అద్దంకి, న్యూస్‌టుడే : పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లెక్క చేయకుండా కారులో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను అద్దంకి పోలీసులు కాపాడారు. ఈ సంఘటన అద్దంకి నుంచి రేణంగివరం వెళ్లే దారిలో నల్లవాగు వద్ద మంగళవారం ఆర్ధరాత్రి దాటాక జరిగింది. అద్దంకి పట్టణ సీఐ రమేష్‌ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పామురుకు చెందిన వెంకటేష్‌ తన స్నేహితుడితో కలసి కారులో రాజమండ్రి వెళ్తున్నారు. అద్దంకి దాటాక పోలీసులు వారిస్తున్నా కారులో నల్లవాగు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వాగు ఉద్ధృతికి కారు అదుపు తప్పి కొంచెం దూరం కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన పోలీసుల్లో ఒకరు తాడు కట్టుకుని కారు వద్దకు వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం కారును కూడా లాగారు. అద్దంకి తహసీల్దార్‌ సుబ్బారెడ్డి పోలీసులను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని