logo

లోకేశ్‌ చొరవతో పొలాల్లో నీరు బయటకు...

రైతుల్ని ఆదుకుంటాం అని మాటలతో చెప్పి వదిలేయకుండా కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రైతులకు అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదకొండూరులో లోకేశ్‌ ఆదేశాలతో బుధవారం సాయంత్రం కొత్త...

Published : 07 Dec 2023 05:32 IST

దుగ్గిరాల, న్యూస్‌టుడే: రైతుల్ని ఆదుకుంటాం అని మాటలతో చెప్పి వదిలేయకుండా కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రైతులకు అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదకొండూరులో లోకేశ్‌ ఆదేశాలతో బుధవారం సాయంత్రం కొత్త కాలువ పూడికతీత పనులను తెదేపా నాయకులు చేయిస్తున్నారు. చేలల్లో నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా పొక్లెయిన్‌తో పనులు చేయిస్తున్నారు. తెదేపా మండల అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు దగ్గర ఉండి పనులు చేయించారు. చేలు మునిగిపోయి 48 గంటలు అయినా ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని గ్రామ రైతు, తెదేపా నాయకుడు మొలబంటి ధనుంజయ అన్నారు. లోకేశ్‌ చేసిన సాయం వల్ల తమ గ్రామంలో వందల ఎకరాల్లో నిలిచిన నీరు బయటకు పోతోందని తెలిపారు. ప్రభుత్వం ముందుగా స్పందించి పూడిక తీయించి ఉంటే 200 ఎకరాల రైతులకు కష్టాలు తప్పేవని కేసంనేని శ్రీఅనిత అన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్‌యాదవ్‌, ఎంపీటీసీ సభ్యులు పుతుంబాక సాయికృష్ణ, విశ్వనాధపల్లి శివకుమార్‌ జనసేన నాయకులు కట్టెపోగు వినోద్‌బాబు, రత్నాకర్‌, సుమన్‌, మాజీ సర్పంచి తోట పిచ్చయ్య పనులు పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని